ETV Bharat / crime

ట్రాన్స్​జెండర్​కు వరకట్న వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు - తెలంగాణ నేరవార్తలు

ట్రాన్​జెండర్​నని చెప్పినా పెళ్లిచేసుకున్నాడని.. మూడో వివాహ వార్షికోత్సవం రోజున రూ.5 లక్షలు వరకట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని తన భర్తపై ఫిర్యాదుచేసింది. ఇంకా ఎవరినీ మోసం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్​బీనగర్​ పోలీసులను ఆశ్రయించింది.

transgender dowry complaint
ట్రాన్స్​జెండర్​కు వరకట్న వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
author img

By

Published : Feb 19, 2021, 9:56 AM IST

తన భర్త రూ.5 లక్షల వరకట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ ట్రాన్స్​జెండర్​ హైదరాబాద్​ ఎల్​బీనగర్​ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఏపీలోని ఏలూరుకి చెందిన తారక మహష్​​ తన భర్తని తెలిపింది. తాను ట్రాన్స్​జెండర్​నని.. పిల్లలు కలగరని చెప్పినా పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది.

నా పేరు ఏడుకొండలు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్​కు వచ్చేశాను. ఎంబీఏ పూర్తిచేశాను. అనంతర క్రమంలో శస్త్రచికిత్స చేయించుకొని ట్రాన్స్​జెండర్​ (భూమి)గా మారాను. మూడేళ్ల క్రితం ఏలూరుకు చెందిన తారక మహేష్​.. ఫేస్​బుక్​లో పరిచయమయ్యాడు. అదికాస్త ప్రేమగా మారింది. తాను ట్రాన్స్​జెండర్​నని చెప్పినా వివాహం చేస్తుకుంటానన్నాడు. 2018 జనవరిలో పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి వారానికి రెండు రోజులు తన దగ్గరికి వచ్చేవాడు. వివాహ వార్షికోత్సవం రోజున రూ.5 లక్షలు వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. లేకుంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. నాకు భర్త కావాలి. న్యాయం చేయండి.

- భూమి, బాధితురాలు

transgender dowry complaint
బాధితురాలు బయటపెట్టిన పెళ్లి నాటి ఫొటో

గత మూడేళ్లుగా అతని కోసం రూ.10 లక్షలు ఖర్చుచేశానని.. ఇప్పుడు మళ్లీ డబ్బులు తీసుకురమ్మని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మహేష్​.. ఇంకా ఎవరినీ మోసం చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది.

ట్రాన్స్​జెండర్​కు వరకట్న వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

ఇవీచూడండి: టీవీల్లో చూసి ఏడుస్తూ వచ్చాం.. నాగమణి తల్లిదండ్రుల ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.