ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో విషాదం జరిగింది. బావిలో దూకి తల్లీ, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది చిన్నారితో కలిసి ఓ తల్లి బావిలో దూకింది.
నిన్నటి నుంచి తల్లీ, బిడ్డ కనిపించకుండా పోయారు. ఇవాళ బావిలో విగతజీవులుగా తేలారు. కుటుంబ కలహాలే కారణమని వారి బంధువులు చెబుతున్నారు. మృతురాలిని మేకలబండకు చెందిన శ్రావణిగా పోలీసులు గుర్తించారు.