ETV Bharat / crime

చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి - ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో

చేతికందిన పంటను కాపాడుకునేందుకు ఆ రైతు వ్యయప్రయాసలకోర్చి బోరు వేసుకున్నాడు. మోటర్ బిగించి కష్టాలు గట్టెక్కనున్నాయని సంతోషపడే లోపే.. ట్రాక్టర్ రూపంలో అతడిని మృత్యువు కబళించింది. తనతోపాటే మరో 14ఏళ్ల బాలుడిని బలిగొంది. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చోటుచేసుకుంది.

Tractor overturns Two killed in nizamabad indhalwai
చెరువులోకి ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
author img

By

Published : Feb 11, 2021, 10:58 PM IST

పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడ్డ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో.. ఓ యువ రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. తీవ్రగాయల పాలైన మరో బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలంలో చోటుచేసుకుంది.

పెళ్లైన ఏడాదికే..

రూప్లా నాయక్ తండాకు చెందిన రైతు బాధావత్ ధన్సింగ్.. వరి పంట నీటి ఎద్దడి గురవుతుండటంతో కొత్తగా బోరు తవ్వించాడు. మోటర్ బిగించి, తోడుగా వచ్చిన బాలుడు బానోత్ అరుణ్​ను తీసుకొని ట్రాక్టర్​పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు వాహనం.. కట్టపై నుంచి చెరువులోకి బోల్తా పడింది.

మృతుడు ధన్సింగ్​కు ఏడాది క్రితం వివాహం కాగా.. భార్య గర్భవతి అని స్థానికులు తెలిపారు. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: మేడ్చల్ జిల్లా కాకతీయనగర్‌లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.