ETV Bharat / crime

మహిళా కూలీల ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం - road accidents in telangana

tractor-accident
ట్రాక్టర్‌ బోల్తా
author img

By

Published : Nov 3, 2021, 8:48 AM IST

Updated : Nov 3, 2021, 10:52 AM IST

08:43 November 03

ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 మంది మహిళా కూలీలు

కూలీలు చేసుకుని పూట గడుపుకునే జీవితాలు వారివి. ఇంట్లో పని చక్కబెట్టుకుని..  పని కోసం ఆ మహిళలు బయలుదేరారు. కానీ అనుకోని ప్రమాదం వారిని చుట్టుముట్టింది. ఖమ్మంలోని నేలకొండపల్లి మండలం మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఉదయమే పనికోసం బయలు దేరగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  

ప్రమాద సమయంలో ట్రాక్టర్​లో 20 మంది మహిళా కూలీలు ఉన్నారు. పత్తి తీసేందుకు మంగాపురం నుంచి గండ్రాయి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చూడండి: private bus accident today: ప్రైవేటు బస్సు బోల్తా.. 17 మందికి తీవ్రగాయాలు

Last Updated : Nov 3, 2021, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.