ETV Bharat / crime

Drugs Manufacture: 'ఇంటినే ల్యాబ్‌గా మార్చాడు.. ఒక్క గ్రామ్‌తో 20 మందికి కిక్కిచ్చాడు'

Drugs Manufacture: సొంతగా ఒక ల్యాబ్​ను తయారు చేశాడు.. సామాజిక మాధ్యమాలు, అంతర్జాలంలో వెతికి పలు రకాల రసాయనాలు సేకరించాడు.. వివిధ ప్రాంతాలు తిరిగి తయారీ విధానాన్ని నేర్చుకున్నాడు. శతవిధాలా ప్రయత్నించి చివరకు విజయం సాధించాడు. తాను అనుకున్న రసాయనాన్ని తయారు చేశాడు. కానీ అతన్ని పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. అదేంటి అంత కష్ట పడిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అనుకుంటున్నారా.. ఇంతకీ అతను తయారు చేసింది ఏంటో తెలుసా..? ఒక్క గ్రాముతో 20 మందిని మత్తులోకి తేలియాడేలా చేసే డీఎంటీ డ్రగ్.

Drugs Manufacture
డ్రగ్స్ తయారీ సామగ్రి
author img

By

Published : Mar 31, 2022, 10:48 PM IST

Drugs Manufacture: జూబ్లీహిల్స్‌ పరిధిలో డ్రగ్స్‌ తయారు చేసి, విక్రయిస్తూ పట్టుబడిన శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సూర్యాపేటకు చెందిన శ్రీరామ్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. చదువుకునే రోజుల్లోనే మత్తు పదార్ధాలకు అలవాటు పడిన శ్రీరామ్.. ఉద్యోగం లేక చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దొరికిన మత్తు పదార్ధాలు సేవించేవాడు. గంజాయి మత్తు సరిపోక తానే సొంతంగా ఓ డ్రగ్​ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం రెండేళ్ల పాటు డీఎంటీ డ్రగ్ తయారు చేసేందుకు ప్రయత్నించాడు. దానిని ఎలా తయారు చేయాలో అంతర్జాలంలో వెతికాడు. సామాజిక మాధ్యమాల్లో కొందరిని పరిచయం చేసుకున్నాడు. విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలకు వెళ్లి వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడు.

Drugs Manufacture
డ్రగ్స్ తయారీలో వాడిన పరికరాలు

రిషికేశ్, హిమాలయాలకు వచ్చే పర్యాటకుల నుంచి ఫార్ములా సేకరించాడు. అందుకు కావాల్సిన ముడి పదార్ధాలను కొన్ని ఈ కామర్స్ వెబ్​సైట్లలో కొనుగోలు చేశాడు. మరికొన్ని రసాయనాలు దుకాణాలకు ఒక కెమిస్ట్రీ విద్యార్ధిలాగా వెళ్లి కొనుగోలు చేశాడు. తనకు ప్రాక్టికల్స్ చేసేందుకు కావాలని వారికి అధిక డబ్బు ఇచ్చి కొనుగోలు చేశాడు. వీటన్నింటినీ తీసుకుని తాను రాసుకున్న వివరాలతో పరీక్షలు ప్రారంభించాడు.

Drugs Manufacture
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్

ఇంటినే ల్యాబ్‌గా మార్చి..

కొండాపూర్‌లో ఉంటున్న తన ఇంటినే ల్యాబ్‌గా మార్చాడు. దాదాపు రెండేళ్లపాటు ప్రయోగాలు చేసి ఎట్టకేలకు మత్తు మందు తయారీలో సక్సెస్‌ అయ్యాడు. తొలుత తనతో పాటు స్నేహితులపై పరీక్షించి డ్రగ్స్‌ పనిచేస్తున్నాయని నిర్ధారణకు వచ్చాడు. ఒక గ్రాముతో 20 మందికి కిక్కు ఇస్తుందని స్వయంగా తెలుసుకున్నాడు. ఆ మత్తు పదార్థాన్ని సేవించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా సేకరించి విక్రయించడం ప్రారంభించాడు. తాను తయారు చేసిన డ్రగ్‌ ఆవిరి రూపంలో ఓ పరికరం నుంచి సేవించాలని వినియోగదారులకు తెలిపాడు. ఇతనికి పరిచయం అయిన... సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కస్టమర్‌ సర్వీసు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న దీపక్‌కు కూడా విక్రయించాడు. క్రమంగా డిమాండ్‌ పెరగడంతో ఒక గ్రాము రూ.8 వేల చొప్పున విక్రయించడం మొదలుపెట్టాడు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న క్రమంలో శ్రీరామ్‌తో పాటు దీపక్‌ అనే వినియోగదారుడిని నార్కోటిక్‌ విభాగం అరెస్టు చేసింది. వీరి నుంచి 8 గ్రాముల డీఎంటీ డ్రగ్‌, తయారీ పరికరాలు, రెండు మొబైల్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని ఇంటిని పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన ల్యాబ్‌, అందులో ఉన్న పరికరాలు చూసి అవాక్కయ్యారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.