అద్దెకి గది కావాలని వచ్చిన దుండగుడు ఒంటరిగా ఉన్న ఉమాదేవి అనే మహిళను కత్తితో బెదిరించి బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గౌతమి నగర్‌లో మహిళను బెదిరించిన దుండగుడు ఆమె మెడలోంచి 2.7 తులాల పుస్తెలతాడు, మొబైల్ ఫోన్‌ను తీసుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించి కేసును ఛేధించారు.
నిందితుడు అరెస్ట్
గౌతమి నగర్‌లో చోరీ జరిగిన 3 గంటల్లోనే నిందితుడిని వనస్థలీపురం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పుస్తెలతాడు, 2 సెల్‌ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ బరిలోకి తెదేపా అధ్యక్షుడు రమణ