ATM Chori in Sanatnagar: సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో ఉన్న ఏటీఎంలో నుంచి దుండగులు అక్రమంగా నగదు కాజేశారు. గతనెల 5వ తేదీన ఉదయం 9:30 నిమిషాల సమయంలో మహేష్ బ్యాంకు ఏటీఎం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వివిధ డెబిట్ కార్డుల ద్వారా రూ 7లక్షలకు పైగా విత్‌డ్రా చేశారు. పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసినప్పటికీ.. సంబంధిత ఖాతాల నుంచి నగదు డ్రా అయినట్లు సమాచారం నమోదు కాలేదు.
ఏటీఎం యంత్రంలో నుంచి నగదు బయటకు వస్తున్న సమయంలో నిందితులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ప్రాసెస్ పూర్తి కావడంతో నగదు బయటకు వచ్చింది. కంప్యూటర్ రికార్డులో మాత్రం నమోదు కాలేదు. లెక్కల్లో తేడా రావడంతో బ్యాంక్ అధికారులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించడంతో నేరం జరిగినట్లు గుర్తించిన బ్యాంక్ మేనేజర్ సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి: