Bike accident in Kadapa: కడప శివారులోని స్పిరిట్ కళాశాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
కడపకు చెందిన నలుగురు యువకులు రెండు వేరువేరు బైకుల్లో వెళ్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారిలో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: