హైదరాబాద్ అబిడ్స్‌లో జరిగిన మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు ఛేదనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కిడ్నాపైన బాలుణ్ని ఈనెల 19న శుక్రవారం పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది.
బాలుడి ఆచూకీ కోసం సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించిన రాష్ట్ర పోలీసులు మహారాష్ట్రలోని మాలేగావ్‌లో కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్ నుంచి మాలేగావ్ వరకు 800కుపైగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ కేసులో పోలీసులు చూపిన చొరవను కచ్చితంగా అభినందించాల్సిందే.