ETV Bharat / crime

Warangal Murders: కాళ్లుపట్టుకుని వేడుకున్నా వదల్లేదు.. రక్తపు మడుగులోనే..! - Warangal murders case

ఆస్తి కోసం సొంత అన్నావదినలపై తమ్ముడే దాడి చేసి... ముగ్గురిని హతమార్చిన ఘటన వరంగల్​లో కలకలం రేపింది. పిల్లలని కూడా చూడకుండా.. విచక్షణారహితంగా కత్తులతో తెగబడ్డారు. వదిలేయమని కాళ్లుపట్టుకుని వేడుకున్నా... కించిత్​ కనికరం కూడా చూపలేదు. రక్తపు మడుగులో కొట్టుకుంటూ ముగ్గురు ప్రాణాలొదలగా.. బాధితుని ఇద్దరు కొడుకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.

three-persons-brutally-killed-by-won-brother-in-warangal

author img

By

Published : Sep 1, 2021, 5:45 PM IST

కాళ్లుపట్టుకుని వేడుకున్నా వదల్లేదు.. రక్తపు మడుగులోనే..!

వరంగల్ ఎల్బీనగర్​లో ఒకే కుటుంబంలో జరిగిన మూడు హత్యలు తీవ్ర కలకలం రేపాయి. బంధాలు, విలువలు మరిచి ఆస్తి కోసం... సొంత అన్నతో సహా ఇతర కుటుంబసభ్యులపై కత్తులతో దాడి చేసి చంపాడు ఓ తమ్ముడు. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో చాంద్​పాషా ఇంటికి షఫీ... తన అనుచరులతో కలిసి ఆటోలో వచ్చాడు. ఎలక్ట్రిక్ రంపంతో తలుపులు కోసి ఇంట్లోకి ప్రవేశించారు. గాఢ నిద్రలో ఉన్న చాంద్ పాషా, భార్య, కుమార్తె, కొడుకులు రంపపు శబ్ధానికి లేచారు. దాడికి వచ్చారని గ్రహించి అప్రమత్తమయ్యేసరికే... ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపర్చగా... రక్తపు మడుగులో కొట్టుకుంటూ చాంద్ పాషా, అతడి భార్య సబీరా బేగం, బావమరిది ఖలీల్ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన చాంద్ పాషా కుమారులు ఫయీద్, సమద్​లను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

కాళ్లుపట్టుకున్నా విడిచిపెట్టలేదు...

నగరంలోని ఎల్​బీనగర్​లో నివాసముంటున్న చాంద్​పాషా... పశువుల క్రయ విక్రయ వ్యాపారం నిర్వహిస్తుండగా... తమ్ముడు షఫీ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాడు. వ్యాపార లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. వ్యాపారంలో నష్టం రావటం, అప్పులు కావడం వల్ల.. ఆస్తి పంపకాలు వాటాలు వేసుకునే క్రమంలో అన్నదమ్ముల మధ్య తగాదాలు మొదలైయ్యాయి. మిగిలి ఉన్న ఆస్తి తనకు ఇచ్చేయాలంటూ షఫీ తరచూ గొడవలకు దిగడంతో.. పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. ఆస్తి దక్కట్లేదన్న అక్కసుతో... సొంత అన్న అని కూడా చూడకుండా అతిదారుణంగా ఈ హత్యలకు తెగబడ్డాడు. జరిగిన ఘటన తెలిసి చాంద్ పాషా మిగిలిన కుటుంబసభ్యులు అతాశులయ్యారు. "కాళ్లుపట్టుకుని ప్రాధేయపడ్డా... బాబాయ్ కనికరం చూపలేదు" అని చాంద్​పాషా కుమార్తె రుబీనా కన్నీరు మున్నీరౌతోంది. తల్లిదండ్రులను కిరాతకంగా హతమార్చిన బాబాయిని కూడా అదే విధంగా చంపాలని రుబీనా ఆక్రందన వ్యక్తం చేస్తోంది.

ఫోన్​కాల్స్​ ఆధారంగా..

సమాచారం అందుకున్న ఏసీపీ గిరిధర్ కుమార్, ఇంతెజార్ గంజ్ పోలీసులు... హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ కూడా ఘటనా స్ధలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తూ... కీలక ఆధారాలు సేకరిస్తున్నాట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు, అతడికి సహకరించిన వారి ఫోన్ కాల్స్​ ట్రేస్ చేస్తున్నామన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు... అనుమానితులనూ ప్రశ్నిస్తున్నారు. తెల్లవారుతుండగా జరిగిన హత్యల ఉదంతం.. నగరప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.

సంబంధిత కథనం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.