గుర్తుతెలియని వ్యక్తుల దాడుల్లో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ రురల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఒగ్లాపూర్ బస్టాండ్ సమీపంలో...
వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్‌కు చెందిన మంద జ్ఞానేందర్, సంతోష్, గుమ్మడి దాసుతో పాటు.. మరో ఇద్దరు మండలంలోని పసరగొండలో బంధువుల అంత్యక్రియలకు హాజరై వరంగల్‌కు తిరిగి వస్తున్నారు.
బైక్‌పై వచ్చిన ఇద్దరు..
ఈ క్రమంలో దామెర మండలం ఒగ్లాపూర్ బస్టాండ్ సమీపంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. వారి ద్వి చక్రవాహనాలను ఆపి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలవ్వగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితులను ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి:నష్టాల్లోనే స్టాక్‌మార్కెట్లు- 14 వేల 200 దిగువన నిఫ్టీ