నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ పైలాన్ శివాలయం పుష్కర్ ఘాట్ వద్ద.. కృష్ణా నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఉపనయనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాగరాజు(39), చంద్రకాంత్(20), వాచస్పతి(26) కృష్ణానదిలో స్నానానికి దిగారు. అయితే అప్పుడే ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి.. విద్యుత్ ఉత్పత్తి కోసం 20,000 క్యూసెక్కుల నీరు వదలడంతో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నీటి ప్రవాహంలో ముగ్గురూ కొట్టుకుపోయారు.
ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి మృతదేహాలను కనుగొన్నారు. నాగరాజు స్వస్థలం నల్గొండ కాగా, మిగతా ఇద్దరు స్థానికులని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: Sarpanch Suicide: అప్పులు చేసి అభివృద్ధి చేశాడు.. బిల్లులు రాక ఉసురు తీసుకున్నాడు
పెళ్లి భోజనంలో పనీర్ పెట్టలేదని గొడవ.. బెల్టులతో కొట్టుకున్న వధూవరుల బంధువులు