ఏపీలో వేర్వేరు ఘటన(Accident news in Ap)ల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు.. విజయవాడ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం(Accident news in Ap)లో మరణించారు. కండ్రిగ - పాతపాడు రహదారిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాంబేకాలనీకి చెందిన ముగ్గురు చనిపోయారు.
కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో..
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి జాతీయ రహదారిపై గన్నవరం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది(Accident news in Ap). ఈ ప్రమాదం(Accident news in Ap)లో ఓ వ్యక్తి మరణించిగా మరో యువకుడికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గుంటూరు జిల్లా కల్లూరుకి చెందిన సాయికుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆత్కూరు ఎస్సై జీ. శ్రీనివాసరావు తెలిపారు.
మరోవైపు.. ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటన(Accident news in Ap)లో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బాదంపూడి వై-జంక్షన్ వద్ద మలుపు తిరిగే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.