టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్‌పై నారాయణగూడ, తుకారాంగేట్ పోలీసు ఠాణాల పరిధిలో పందాలకు పాల్పడుతున్న ముగ్గురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. హరియాణాలోని నార్నోల్‌కు చెందిన కనక్ అగర్వాల్(34), నారాయణగూడ పరిధి హైదర్‌గూడలో ఉంటూ పందాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర రాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన ప్రధాన బుకీ అమిత్ అగర్వాల్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది.
సికింద్రాబాద్, తుకారాంగేట్‌లో ఉండే రాజస్థాన్ రాష్ట్రం, చురు గ్రామానికి చెందిన వ్యాపారి అంకిత్ అగర్వాల్(31) అతని సోదరుడు మోహిత్ అగర్వాల్(29) 2016 నుంచి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరికీ అమిత్ అగర్వాల్‌తో పరిచయం ఉంది. మోహిత్ అగర్వాల్ అయిదుసార్లు అరెస్ట్ అయ్యాడు. ఆదివారం టాస్క్‌ఫోర్స్(ఓఎస్‌డీ) డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆధ్వర్యంలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐలు, ఎస్సైలు ఏకకాలంలో దాడులు చేశారు. అంకిత్ అగర్వాల్, మోహిత్ అగర్వాల్ నుంచి రూ.65 వేలు, కనక్ అగర్వాల్ నుంచి రూ.1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: