ETV Bharat / crime

మహానగరంలో జోరుగా క్రికెట్‌ పందేలు... ముగ్గురు నిందితులు అరెస్ట్

IPL Betting in Hyderabad : వేసవిలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు క్రికెట్‌ అభిమానులకు ఆహ్లాదం పంచుతుంటే.. మరోవైపు పందేలతో నిర్వాహకులు హోరెత్తిస్తున్నారు. ఏపీ, కర్ణాటక, రాజస్థాన్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు యాప్‌ ద్వారా పందేలు నిర్వహిస్తున్నట్టు గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

IPL CRICKET BETTING
IPL CRICKET BETTING
author img

By

Published : Apr 4, 2022, 10:38 AM IST

IPL Betting in Hyderabad : ఐపీఎల్‌ సీజన్‌ మొదలైందంటే చాలు పందెం రాయుళ్లకు పండగే. సరదా కోసం బెట్టింగ్‌ల వైపు మొగ్గు చూపే యువత తేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరుగుతోంది. క్రికెట్‌ అంటే యువతకు సాధారణంగానే ఇష్టం ఉంటుంది. ఇక పొట్టి క్రికెట్‌ అంటే మరింత క్రేజు. టీవీల్లో చూస్తూ ఎంజాయ్‌ చేస్తూనే బెట్టింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. వారి ఆసక్తి, సరదా పందెం రాయుళ్లకు కాసుల వర్షం కురుస్తోంది. ఏపీ, కర్ణాటక, రాజస్థాన్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు యాప్‌ ద్వారా పందేలు నిర్వహిస్తున్నట్టు గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి జాబితాలో 100-150 మంది వరకూ ఇప్పటికే లక్షలాది రూపాయలు పందేలు కాసినట్టు గుర్తించారు. గతేడాది సైబరాబాద్‌ పోలీసులు ఐదారు బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా పందేలు నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. 275 మొబైళ్లు, 8 ల్యాప్‌ట్యాప్‌లు, రూ.93 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Cricket Betting in Hyderabad : క్రికెట్‌ పందేలు ఆడుతున్న జాబితాలో చిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు అధికంగా ఉంటున్నారు. స్నేహితులు, లోన్‌ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుని మరీ పందేలు కాస్తున్నట్టు సైబరాబాద్‌కు చెందిన ఓ ఏసీపీ తెలిపారు. యాప్‌ల ద్వారా పందేలు కాసేవారి వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు సైబర్‌ నేరస్తుల చేతుల్లోకి చేరే అవకాశం ఉందని హెచ్చరించారు. నిజాంపేట్‌కు చెందిన ఓ యువకుడు గతేడాది క్రికెట్‌ పందేల కోసం రూ.10లక్షలు అప్పు చేశాడు. స్నేహితులు ఒత్తిడి తీసుకురావటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన వివరించారు. తేలిక మార్గంలో డబ్బు సంపాదించేందుకు ఇటువంటి తప్పుడు దారుల్లో నడవొద్దని సూచించారు.

అపార్ట్‌మెంట్స్‌లోనే దందా.. గతంలో టీవీల్లో ప్రసారమయ్యే మ్యాచ్‌లను వీక్షిస్తూ పందేలు కాసేవారు. ల్యాప్‌ట్యాప్‌/ట్యాబ్‌లు, మొబైల్‌ఫోన్లు, వైఫై సౌకర్యం. ఇవి ఉంటే చాలు ఎక్కడనుంచైనా క్రికెట్‌ పందేలు నిర్వహించవచ్చు. గ్రేటర్‌ పరిధిలో బేగంబజార్‌, ఘాన్సీబజార్‌, దూల్‌పేట్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొంపల్లి తదితర ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు/అపార్ట్‌మెంట్స్‌లను అడ్డాగా మార్చుకుని క్రికెట్‌ బెట్టింగ్‌ కొనసాగిస్తున్నట్టు సమాచారం. నకిలీ పేర్లతో సిమ్‌కార్డులు కొనుగోలు చేసి దందా సాగిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీలు జరిగినా యాప్‌ల ద్వారానే పందేలు నిర్వహిస్తున్నారని నగరానికి చెందిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సుమారు 20-30 వరకూ బెట్టింగ్‌యాప్‌ల్లో రూ.కోట్లల్లో చేతులు మారుతున్నాయి.

బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు.. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌జోన్‌ డీసీపీ చందనదీప్తి తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడలోని న్యూఅశోక్‌నగర్‌లో ఉండే మహమ్మద్‌ రిజ్వానుద్దీన్‌(26), అదే ప్రాంతంలో ఉండే షేక్‌ ఇబ్రహీం(25) సులభంగా డబ్బు సంపాధించడం కోసం క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 1న ముంబయిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌-లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్లు మధ్య ఐపీఎల్‌ టీ20 మ్యాచ్‌ కొనసాగుతుంది. అదేరోజు చిలకలగూడలోని జమీల్‌ బిన్‌ ఉస్మానియా మసీద్‌ సమీపంలోని ఓ ఇంట్లో వీరు క్రికెట్‌ బెట్టింగ్‌ సాగిస్తున్నారు. పంటర్లతో ఫోన్ల ద్వారా మాట్లాడుతూ బెట్టింగ్‌ చేపట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ నేతృత్వంలో ఎస్సైలు శ్వేత, సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై నగేష్‌లు సిబ్బందితో వెళ్లి బెట్టింగ్‌ కొనసాగిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేల నగదు, 2సెల్‌ఫోన్లను స్వాధీనం చేసిన ఆదివారం రిమాండుకు తరలించారు.

ఇదీ చదవండి:పబ్‌లో డ్రగ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.