Minor Girl Rape Case: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లిహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు మైనర్లతో పాటు సాదుద్దీన్ మాలిక్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఆ ముగ్గురు నిందితులను రిమాండ్‌కి తరలించారు. జూబ్లిహిల్స్ ఠాణాలో సాదుద్దీన్ మాలిక్‌ను విచారించిన పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం.. వనస్థలిపురంలోని నాయమూర్తి ఇంట్లో సాజిద్‌ను హాజరుపరిచారు. సాజిద్‌కు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అరెస్టయిన మరో ఇద్దరు నిందితులైన ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారునితో పాటు ఇంకో మైనర్‌ను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన అనంతరం.. ఇద్దరిని జువెనైల్ హోంకి తరలించారు. మరోవైపు పరారీలో ఉన్న ఇంకో ఇద్దరు నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని కర్ణాటకలో ఆదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో ఉమర్‌ఖాన్‌తో పాటు మరో మైనర్ కూడా ఉన్నాడు. వారిని రేపు రిమాండ్‌కు తరలించనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. మొయినాబాద్‌లో కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇన్నోవా కారును జూబ్లీహిల్స్ పీఎస్‌కి తీసుకొచ్చారు. ప్రస్తుతం క్లూస్ టీం ఆదారాలు సేకరిస్తోంది. అయితే.. అత్యాచారానికి పాల్పడ్డ కారు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో ఇప్పటికే బాలికకు భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎఫ్ఎస్ఎల్కి పంపారు. ప్రస్తుతం బాలికకు ఆరోగ్యంగా ఉందని పోలీసులు తెలిపారు.
కేసులో కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్‌పై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని మొదట భావించిన పోలీసులు.. ఈ మొత్తం ఘటనలో ఐదుగురు మాత్రమే పాల్గొన్నట్లు ధ్రువీకరించారు.
ఇవీ చూడండి: