ETV Bharat / crime

నగ్న వీడియోలతో బెదిరింపులు, చివరికి కటకటాల లెక్కింపు - ఏపీ తాజా వార్తలు

Nude video call మహిళలను భయపెట్టో, ప్రలోభపెట్టో నగ్నంగా వీడియో కాల్‌ చేసేలా ఒత్తిడి తెచ్చి.. దాన్ని రికార్డు చేసి, వారిని బెదిరించి కొందరు మోసగాళ్లు లొంగదీసుకుంటున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో మూడు వారాల వ్యవధిలోనే ఇలాంటివి రెండు కేసులు నమోదవడం గమనార్హం. అసలు ఏం జరిగిందంటే.

nude video call
నగ్న వీడియో కాల్​
author img

By

Published : Aug 18, 2022, 12:32 PM IST

Nude video call: గత నెలలో ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఓ మోసగాడి వలలో చిక్కి నగ్నంగా వీడియో కాల్‌ చేసి చిక్కుల్లో పడింది. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వివాహిత నగ్నవీడియో కాల్‌ను రికార్డు చేసి బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు.

ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఓ వివాహిత.. భర్తతో విడిపోయి పిల్లలతో వేరుగా ఉంటోంది. బతుకుతెరువు కోసం దుకాణం నడుపుకుంటోంది. వ్యాపార అవసరాల కోసం అదే ప్రాంతానికి చెందిన హన్సకుమార్‌ జైన్‌ అనే వడ్డీ వ్యాపారి నుంచి అప్పు తీసుకునేది. ఇటీవల ఆమె అప్పు అడగ్గా ఎక్కువ వడ్డీ అవుతుందని, ఇష్టమైతేనే తీసుకోవాలని సమాధానమిచ్చాడు. లేనిపక్షంలో నగ్నంగా తనకు వీడియోకాల్‌ చేయాలని, గెస్ట్‌హౌస్‌కు రావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. గత్యంతరం లేక ఆమె నగ్నంగా వీడియో కాల్‌ చేసింది.

దీనిని హన్సకుమార్‌ స్క్రీన్‌ రికార్డర్‌ సాయంతో తన సెల్‌లో రికార్డ్‌ చేశాడు. దీన్ని విజయవాడ కానూరులో ఉంటున్న అతని బంధువు చందు చూసి.. తన ఫోన్‌, ల్యాప్‌టాప్‌లోకి కాపీ చేసుకున్నాడు. వీటిని పోర్న్‌ సైట్లలోకి అప్‌లోడ్‌ చేసి, వాటి లింక్‌ను బంధువులకు పంపిస్తానని చందు ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. వీడియో తాలూకూ స్క్రీన్‌ షాట్‌ను తీసి బాధితురాలితో పాటు తన వ్యాపార భాగస్వామికి కూడా పంపాడు. వేధింపులు ఎక్కువవడంతో ఆమె మచిలీపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దీనిని మహిళా పోలీసుస్టేషనుకు బదిలీ చేశారు. కానూరుకు చెందిన చందు, రాజమండ్రికి చెందిన వడ్డీ వ్యాపారి హన్సకుమార్‌ జైన్‌ను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.