ETV Bharat / crime

ZERO FIR: 'అత్యాచారం చేసి నగ్న వీడియోలు తీసి.. బెదిరిస్తున్నాడు'

ఓ మహిళ హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఉద్యోగ విషయం మాట్లాడదామని ఏపీలోని గుంటూరు తీసుకెళ్లాడు. లాడ్జికి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుందామన్నాడు. కట్​చేస్తే ఆమె విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో అత్యాచారం చేసి, నగ్న వీడియోలు తీశాడంటూ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే..

gnt crime
అత్యాచారం కేసు
author img

By

Published : Aug 21, 2021, 10:39 AM IST

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు... ఘటన జరిగింది గుంటూరులో కాబట్టి అక్కడి పోలీసులకు కేసును బదిలీ చేశారు. శుక్రవారం గుంటూరులోని కొత్తపేట సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏమి జరిగిందంటే...

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య పరిచయం చేసుకున్నాడు. ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. తనకు తెలిసినవాళ్లు ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ బ్రహ్మయ్య మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో 2021 జులై 11న ఉద్యోగ విషయం మాట్లాడదామని ఏపీలోని గుంటూరు తీసుకొచ్చాడు. రైలుపేటలోని ఓ లాడ్జికి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుందామన్నాడు.

ఆమె విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెప్పినా, తాను రమ్మని పిలిచినప్పుడల్లా రాకపోయినా ఆ వీడియోలు అందరికి చూపిస్తానని బెదిరించినట్లు పేర్కొంది. అప్పటినుంచి ఆ వీడియోలతో బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని దర్శి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు కేసును గుంటూరులోని కొత్తపేటకు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: Fraud: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్​

నిజామాబాద్‌లో చెత్తకుప్పలో పసికందు మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.