ఇంట్లోకి చొరబడి దోపిడి.. రూ. 3 లక్షల బంగారం చోరీ - Thieves broke into a house in bhadradri
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంటినే లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో నుంచి సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
ఇంట్లోకి చొరబడి దోపిడి.. రూ. 53 లక్షల బంగారం చోరీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చర్ల రోడ్డు ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో దోపిడికి పాల్పడ్డారు. తలుపులు పగలగొట్టి సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 30 వేల నగదును అపహరించారు.
మరుసటి రోజు ఇంటి యజమాని వచ్చి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు గ్రహించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: గోదావరిలో స్నానానికెళ్లి వ్యక్తి మృతి
Last Updated : Mar 14, 2021, 11:43 AM IST