ETV Bharat / crime

రాజధానిలో రోడ్లను వదలని దొంగలు.. రాత్రికి రాత్రే కంకర మాయం - Tullur Mandal latest political news

Thieves are on prowl in the ap capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం-లింగాయపాలె మధ్య ఉన్న రహదారిలో కంకర ఎత్తుకెళ్లారు. పోలీసుల హడావుడి తగ్గడంతో చోరులు తమ పనులను మళ్లీ ప్రారంభించారు. రహదారిలో 90మీటర్ల వరకు మూడు అడుగుల లోతు తవ్వుకెళ్లినట్లు రైతులు తెలిపారు.

Thieves are on prowl in the ap capital
Thieves are on prowl in the ap capital
author img

By

Published : Feb 8, 2023, 3:04 PM IST

Thieves are on prowl in the ap capital: గత కొన్ని రోజులుగా ఏపీ రాజధాని ప్రాంతంలో దొంగలు చెలరేగిపోతున్నారు. పోలీసు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ.. అక్కడక్కడ నిఘా లోపంతో రాజధాని ప్రాంతంలో దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నారు. తమ కన్నుపడిందే తడవు అన్నట్లుగా.. రాత్రికి రాత్రే వస్తువులు మాయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. పోలీసుల హడావుడి తగ్గడంతో చోరులు తమ పనులను ప్రారంభించారు.

తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం-లింగాయపాలె మధ్య ఉన్న రహదారిలో కంకర ఎత్తుకెళ్లారు. రాజధానిలో అంతర్గత రహదారుల కోసం నిర్మించిన ఈ3 రహదారిలో 90మీటర్లు మూడు అడుగుల లోతు తవ్వుకెళ్లినట్లు రైతులు చెప్పారు. గత వారం రోజులుగా రాత్రివేళల్లో దొంగలు కంకర ఇతర సామాగ్రి ఎత్తుకెళ్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని రైతులు చెప్పారు. ఓ ప్రజాప్రతినిధి ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం పలు అనమానాలకు తావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.