Thief Caught At Nunna: ఏపీలోని విజయవాడ శివారు నున్నలో బ్లేడ్ బ్యాచ్ కలకలం సృష్టించారు. పాల ఫ్యాక్టరీలో పనిచేసే కూలీల వద్ద నుంచి రూ.3 వేలు లాక్కొని.. ద్విచక్రవాహనంపై పారిపోయే ప్రయత్నం చేశారు. జనం వెంబడించటంతో ఓ దొంగ బండిపై నుంచి కింద పడి.. తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న మంచినీటి చెరువులోకి దూకాడు. చెరువును చుట్టుముట్టిన జనం.. చెరువులోకి దిగి దొంగను బంధించారు. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
rowdy sheeter: పట్టుబడిన దొంగ... రౌడీషీటర్ ఏబేలుగా పోలీసులు గుర్తించారు. మరో ఆరుగురు దొంగలు పరారైనట్లు వెల్లడించారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి