ETV Bharat / crime

Thief Killed by Villagers: స్థానికుల దాడిలో చోరీకి యత్నించిన దొంగ మృతి

thief killed by villagers
స్థానికుల దాడిలో దొంగ మృతి
author img

By

Published : Dec 7, 2021, 10:17 AM IST

Updated : Dec 7, 2021, 11:02 AM IST

10:07 December 07

స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన దొంగ

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చోరికి యత్నించిన దొంగను స్థానికులు పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేశారు. వారి దెబ్బలకు తాళలేక దొంగ ప్రాణాలు వదిలేశాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చిన్న మల్లారెడ్డిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇదీ జరిగింది...

ఓ వ్యక్తి ట్రాక్టర్​ను దొంగిలించేందుకు వెళ్లాడు. గమనించిన స్థానికులు అతనిని చుట్టుముట్టారు. దొంగకు దేహశుద్ధి చేశారు. స్థానికులు దాడిలో తీవ్రంగా గాయపడిన దొంగ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే దొంగ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా దొంగను పట్టుకున్న స్థానికులు.. పోలీసులకు అతనిని అప్పగించాల్సింది. కానీ చట్టాన్ని వారే చేతిలోకి తీసుకుని దొంగ మృతికి కారణమయ్యారు. అతనిని బంధించి పోలీసులకు అప్పగించినా.. దొంగ ప్రాణాలు దక్కేవి.

ఇదీ చూడండి:

హైదరాబాద్​లో గజదొంగ అరెస్టు: హైదరాబాద్​లో ఇళ్లకు కన్నం వేసి చోరీలకు పాల్పడుతున్న గజదొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 180 తులాల బంగారం, 1.9 లక్షల నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.91 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 27 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Dec 7, 2021, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.