హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. గతరాత్రి ఆలయానికి తాళం వేసి వెళ్లిన ఆలయ పూజారి... ఈ రోజు వచ్చేసరికి ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి చూడగా... హుండీ తలుపులు పగలగొట్టినట్టు, అలాగే స్వామి వారి ఆభరణాలు, వస్తువులను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
వెంటనే ఆలయ పూజారి పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాల వైర్లను దొంగలు కట్ చేశాకే గుడిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆలయం పరిధిలోని మూడు గుళ్లలో ఉన్న 11 కిలోల వెండి ఆభరణాలను, హుండీలోని డబ్బులను ఎత్తుకెళ్లినట్లు వివరించారు. క్లూస్ టీం ఆధారంగా వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని ఎస్సై శ్యాంబాబు తెలిపారు.
ఇవీ చదవండి: మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు