నగల దుకాణాల్లో సిబ్బంది దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.5లక్షల విలువ చేసే వెండి వస్తువులు, ఆటో, చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన రేణుక, ఆమె బంధువులు బతుకుదెరువు కోసం 15ఏళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. రేణుక నేతృత్వంలో ముఠాగా ఏర్పడి చోరీల బాటపట్టారు. ముఠాలో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి ఆటోలో తిరుగుతూ... ఏదైనా జ్యూయలరీ దుకాణాన్ని ఎంచుకుంటారు. వినియోగదారుల్లా నటిస్తూ.... దుకాణంలో ఉన్న యజమాని, సిబ్బందిని దృష్టి మరల్చి వెండి వస్తువులను దాచేసుకొని... అక్కడి నుంచి జారుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై గతంలోనూ పలు ఠాణాల్లో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గుమ్మడిదలలో మహిళ దారుణ హత్య... గొంతు కోసి చంపేశారు!