భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పురాతన కాళీమాత దేవాలయంలో దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. అమ్మవారి ఆభరణాలు లభించకపోవడంతో హుండీ పగలగొట్టి కానుకలు కాజేశారు. ఇదే ఆలయంలో గతంలోనూ చోరీలు జరిగాయని... అమ్మవారి ఆభరణాలు దోచుకెళ్లారని స్థానికులు తెలిపారు.
అన్నీ దోచేశారు!
ఆలయంలోని వెండి, బంగారు ఆభరణాలు, నగదు, చీరలు దోచుకెళ్లారని తెలిపారు. దీనిపై పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా చోరీలు ఆగడం లేదని వివరించారు. అమ్మవారి ఆభరణాల రికవరీలో ఎటువంటి పురోగతి లేదని వాపోయారు.
చర్యలు తీసుకోవాలి
సీసీ కెమెరాలు పగలగొట్టి ఆలయంలో చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ వరుస చోరీల ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానిక కౌన్సిలర్ పద్మావతి, ఆలయ పూజారి కోరుతున్నారు.
ఇదీ చదవండి: గూగుల్‌ను నమ్ముకుంటే.. వధువే మారిపోయింది