ETV Bharat / crime

బాపూ అని పిలిచి.. వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ - వృద్ధదంపతుల ఇంట్లో చోరీ

అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ముులుగు జిల్లా వెంకటాపూర్​ మండలం నల్లగుంట గ్రామంలో జరిగింది.

theft at old age couples house at nallagunta village venkatapur mandal in mulugu district
వృద్ధ దంపతులను బెదిరించి నగదు, బంగారం చోరీ
author img

By

Published : Feb 20, 2021, 3:31 PM IST

వృద్ధ దంపతులను బెదిరించి చోరీకి పాల్పడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దొంగలు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు.

కుమారుడని తలుపు తీశారు :

అర్ధరాత్రి ఇంటిముందు నుంచి బాపు అని పిలవడంతో కాటారపు పెద్ద రాజయ్య, కమల తమ కూమారుడు వచ్చాడని భావించి తలుపు తీసినట్లు తెలిపారు. తలుపు తీయగానే ముగ్గురు దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి తమ నోట్లో బట్టలు కుక్కి, చేతులను కట్టేసి నగదు, బంగారు ఎత్తుకెళ్లారని వాపోయారు.

నోటితో కొరికి మరీ :

వృద్ధురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలను కత్తిరించి, నోటితో సైతం కొరికి తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీరువాలో ఉన్న రూ.1.40 వేలను ఎత్తుకెళ్లినట్లు వృద్ధ దంపతులు పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ఏఎస్సై సాయిచైతన్య, సీఐ దేవేందర్​ రెడ్డి, ఎస్సై రమేశ్​ ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : కోమరబండలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.