virla video భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిల్లాలోని టేకులపల్లి మండంలం గంగారం గ్రామ పరిధిలోని సంపత్ నగర్‌కు చెందిన ఓ యువకుడు(23) అదే గ్రామానికి చెందిన ఓ మహిళ(30)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. గ్రామశివారులోని మామిడి తోటలో చెట్టుకు కట్టి చితక బాదారు. ఈ ఘటన తర్వాత బాధితుడు గ్రామాన్ని విడిచి వెళ్లినట్లు అక్కడి గ్రామస్థులు తెలిపారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సామాజిక మధ్యామాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇవీ చదవండి: