Tipper Accident: టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆ ప్రాంతంలోని నివసిస్తున్న వారి గృహోపకరణాలు కాలిపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారిపేటలో ఇసుక లోడుతో వెళుతున్న టిప్పర్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు ఒకదాని మరొకటి తగలటంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఫలితంగా సుమారు 200 ఇళ్లలో టీవీలు, సెట్ టాప్ బాక్సులు, ఫ్రిడ్జ్‌లు కాలిపోయాయి. ఈ ఘటనకు కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.
ఇవీ చదవండి: