రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మరణించిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట వద్ద జరిగింది. రేవెల్లే గ్రామం నుంచి కరీంనగర్‌కు ద్విచక్రవాహనంపై ఒడ్నాల సంపత్, స్వప్న దంపతులు బయలు దేరారు.
వీరి వాహనంను రాగంపేట వద్ద ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టటంతో ప్రమాద స్థలంలోనే ఆమే ప్రాణాలు కోల్పోయింది. భర్త తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించంటంతో అతను మరణించాడు. ఈ ఘటన గ్రామస్థులను కలిచివేసింది.
ఇదీ చూడండి: వామన్‌రావు దంపతుల హత్య కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదు