ETV Bharat / crime

వైకాపా వేధింపులతో చనిపోతే మృతదేహాన్ని తీసుకెళ్లకుండా ఆపేశారు..! - అంబులెన్స్‌

The police stopped the ambulance: ఆంధ్రప్రదేశ్​లోని అధికార పార్టీ నాయకుల వేధింపులతో పురుగుల మందు తాగిన తల్లీ కుమారుల్లో నిన్న తల్లి చనిపోయిన విషయం తెలిసిందే.. కాగా ఈ రోజు మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. అనంతరం కామాక్షి మృతదేహాన్ని తరలించే క్రమంలో పోలీసులు అంబులెన్సును నిలిపివేశారు.

The police stopped the ambulance
The police stopped the ambulance
author img

By

Published : Nov 17, 2022, 7:18 PM IST

The police stopped the ambulance: ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్​ఆర్​సీపీ నాయకుల వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మహిళ కామాక్షి మృతదేహానికి కాకినాడ జీజీహెచ్​లో పోస్టుమార్టం పూర్తయినా.. స్వగ్రామానికి తరలించకుండా పోలీసులు ఆపారు. కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతూ కామాక్షి నిన్న మధ్యాహ్నం మృతి చెందగా.. ఇవాళ పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం 12:30 గంటల సమయంలో మృతదేహాన్నిఅంబులెన్సు వాహనంలోకి ఎక్కించగా.. పోలీసులు ఆ వాహనాన్ని ఆసుపత్రి బయటే మూడు గంటలకుపైగా నిలిపివేశారు.

కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా పోలీసులు ఏ మాత్రం కనికరించ లేదు. మృతదేహాన్ని స్వగ్రామం తరలించాలంటూ మామిడితోటలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం మామిడితోటలో రోడ్డు పక్కన 40 ఏళ్లుగా ఉంటున్న కామాక్షి ఇంటిని తొలగించటం కొత్త ఇల్లు మంజూరు చేయకపోవటంతో కొడుకుతో కలిసి పురుగు మందు తాగారు. చికిత్స పొందుతూ కామాక్షి చనిపోగా.. కుమారుడు మురళీకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది.. గ్రామానికి చెందిన దుర్గారావు , అప్పారావు, వీర్రాజు భీమన్న చిత్రహింసలకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో తీసి పురుగు మందు తాగిన విషయం తెలిసిందే..

ఆందోళన: అకారణంగా పోలీసులు మృతదేహాన్ని ఇంటికి తరలించకుండా 3 గంటలుగా నిలిపివేయడంతో మృతదేహాన్ని స్వగ్రామం తరలించాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుండగా వారితో పాటు తెదేపా, జనసేన శ్రేణులూ ధర్నా చేశారు. ఈ క్రమంలో నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, నిందితులను అరెస్టు చేయాలని తెదేపా, జనసేన నాయకులు.. కార్యకర్తలు డిమాండ్‌ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఆందోళనకు దిగిన తెదేపా, జనసేన కార్యకర్తలతో పాటు నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (తెదేపా), మర్రెడ్డి శ్రీనివాసరావు (జనసేన)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు కామాక్షి కుటుంబసభ్యులను ఘటనాస్థలి నుంచి పంపించి, మృతదేహాన్ని మామిడితోటకు పోలీసులు తరలించగా మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు.

ఆ జిల్లాలో టెన్షన్​..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.