Boyaguda Fire Accident: బీహార్‌కు చెందిన 11 మంది కార్మికులను బలి తీసుకున్న ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని పోలీసులు తేల్చారు. సికింద్రాబాద్ బోయిగూడ తుక్కు గోదాంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా మరోసారి ఆధారాలు సేకరించింది. ఫ్యూజ్ బాక్సు ఎక్కువ సంఖ్యలో వైర్లు అమర్చడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ సేకరించిన అధారాలతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: