ETV Bharat / crime

వృద్ధురాలి హత్య.. ఒంటి మీది ఆభరణాలు మాయం

ఒంటరిగా నివసిస్తున్న ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సుర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

The old woman was brutally murdered by unidentified thugs in suryapet
వృద్ధురాలి హత్య.. ఒంటి మీది ఆభరణాలు మాయం
author img

By

Published : Mar 24, 2021, 7:54 AM IST

సూర్యాపేట ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హతమార్చారు. మృతురాలి ఒంటిపైనున్న బంగారు, వెండి ఆభరణాలు మాయమవ్వడంతో.. దోపిడీ దొంగలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు .

జిల్లా కేంద్రానికి చెందిన జానకమ్మ (70) పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తోంది. కుమారుడు వాసు.. హైదరాబాద్​లో నివాసముంటూ.. పని నిమిత్తం రోజూ సూర్యాపేటకు వచ్చి వెళుతుంటాడు. ప్రతి రోజు.. రాత్రి ఇంటికి వచ్చి, తల్లి యోగ క్షేమాలు తెలుసుకుని తిరిగి నగరానికి వెళ్లిపోతుంటాడు.

రోజులాగే ఇంటికి వచ్చిన వాసు.. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ దొంగలే హత్యకు కారణమని.. ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇదీ చదవండి: మహిళను వేధించిన పోకిరి.. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.