ETV Bharat / crime

కాపురానికి వెళ్లనన్న నవవధువును దారుణంగా హతమార్చిన తండ్రి - New Bride Murdered

MURDER
MURDER
author img

By

Published : May 31, 2022, 1:49 PM IST

Updated : May 31, 2022, 4:32 PM IST

13:46 May 31

అత్తారింటికి వెళ్లనని తల్లిదండ్రులకు చెప్పిన నవవధువు

New Bride Killed: పెళ్లై నెలరోజులు కూడా కాకముందే కాపురానికి వెళ్లబోనన్న కూతురును దారుణంగా హతమార్చాడో తండ్రి. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయంలో కూతురుకు అండగా నిలిచిన భార్యను కూడా కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఆపై తాను కూడా గుళికల మందు తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

మహబూబ్​నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య మంగళవారం తెల్లవారుజామున భార్య కళమ్మ, కూతురు సరస్వతిని రోకలిబండతో మోది హత్య చేశాడు. సరస్వతికి ఈనెల 8న మహబూబ్​నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వరుడితో వివాహం జరిగింది. 15 రోజల తర్వాత ఆమె తల్లిగారింటికి వచ్చింది. తిరిగి కాపురానికి వెళ్లబోనంటూ తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయంలో తల్లి కళమ్మ సరస్వతికి అండగా నిలవగా కృష్ణయ్య మాత్రం వ్యతిరేకించారు.

కాపురానికి వెళ్లాల్సిందేనంటూ పట్టుపట్టాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన కృష్ణయ్య తల్లికూతుళ్లిద్దరినీ కర్రతో మోది దారుణంగా హత్య చేశాడు. తాను కూడా విషగుళికలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా తెలిపాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బంధువులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. తల్లికూతుళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. కృష్ణయ్య మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు సరస్వతి వివాహం ఈనెల 8న జరిపించాడు. పెళ్లైన తర్వాత ఇంటికి వచ్చిన సరస్వతి కాపురానికి వెళ్లనని చెప్పింది. దీనిపై ఇంట్లో చర్చలు జరుగుతుండేవి. ఈ క్రమంలో కూతురికి తల్లి మద్దతుగా నిలిచింది. దీంతో కోపోద్రేక్తుడైన కృష్ణయ్య వారిద్దరు పడుకున్న సమయంలో కర్రతో విచక్షణారాహితంగా దాడిచేశాడు. అనంతరం తాను విషం తీసుకున్నాడు. సరస్వతి, కళమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలో మృతిచెందారు. ప్రస్తుతం కృష్ణయ్య చికిత్స పొందుతున్నాడు. -- మహేశ్, డీఎస్పీ

ఇవీ చూడండి:

'ఉపకారం చేసినందుకు తాళి అమ్మాల్సిన దుర్గతి సర్పంచ్‌లది'

భాజపాలోకి హార్దిక్ పటేల్.. ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్​కు ఇక కష్టమే!

Last Updated : May 31, 2022, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.