అక్కున చేర్చుకుని ఆదరణ చూపాల్సిన అన్నదమ్ములే.. సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మానవ సంబంధాలను మంట కలుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. చాలా కాలంగా వేధింపులు భరించిన ఓ బాధితురాలు.. చివరకు పోలీసులను ఆశ్రయించింది.
భద్రాచలంలోని సీతారామ నగర్ కాలనీకి చెందిన.. సాయి కుమార్(55), అతని తమ్ముడు మనోహర్ (33)లకు వివాహం జరగకపోవడంతో ఇంట్లోనే తల్లితో కలిసి ఉంటున్నారు. తండ్రి చనిపోగా పెళ్లి కాని ఆ బాధిత మహిళ(35) కూడా ఇద్దరు సోదరులతో సహా ఆ ఇంట్లోనే నివాసముంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా అన్నదమ్ములిద్దరూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సదరు మహిళ ఆరోపిస్తోంది.
మద్యం సేవించి వచ్చి అర్ధరాత్రి దాకా కొట్టడంతో పాటు.. తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని బాధితురాలు పోలీసుల ఎదుట వాపోయింది. గత సంవత్సరం కూడా పీఎస్‌లో ఫిర్యాదు చేశానన్న విషయాన్ని ప్రస్తావించింది. పోలీసులే తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.
ఇదీ చదవండి: కొవిడ్‌తో తల్లిదండ్రుల మృత్యువాత.. దిక్కుతోచని స్థితిలో పిల్లలు