ETV Bharat / crime

Boy died:'ప్రహరీ గోడ పసివాడి ప్రాణాలు తీసింది' - వరంగల్ జిల్లాలో విషాదం

ఆదివారం సరదాగా చెట్టు పైనున్న పండును తెంపుకుని తిందామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పండు తెంపేందుకు యత్నించాడు. కానీ అదే తన చివరి గడియ అవుతుందని ఊహించలేకపోయాడు. సీతాఫలం కోసం ప్రహరీ గోడ ఎక్కుతుండగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గోడ కూలడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Boy died
గోడ కూలడంతో బాలుడు అక్కడికక్కడే మృతి
author img

By

Published : Nov 7, 2021, 8:46 PM IST

వరంగల్​ జిల్లాలో విషాదం జరిగింది. సరదాగా పండు తెంపుకునేందుకు యత్నించిన బాలుడిని గోడ రూపంలో మృత్యువు కబళించింది. సీతాఫలం కోసమని ప్రహరీ గోడపైకి ఎక్కే క్రమంలో బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన దుగ్గొండి మండలం స్వామిరావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పండు తెంపేందుకు బాలుడు ప్రహారీ గోడ ఎక్కుతుండగా ఒక్కసారిగా కూలడంతో గ్రామానికి చెందిన జమలాపురం సన్నీ (11) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లముందే సరదాగా అడుకుంటున్న బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

ఇదీ చూడండి:

Accident live video: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.