ఆడుకుంటూ జామకాయ ముక్కను మింగడంతో.. అది గొంతులో అడ్డుపడి ఊపిరాడక ఓ పసికందు చనిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు శివారు గ్రామం లంకతోటలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
జొన్నలగడ్డ స్వామి, అనిల్‌బాబు దంపతులకు కవల ఆడపిల్లలు జన్మించారు. లంకతోటలోని అమ్మమ్మ ఇంట పిల్లలు ఉండగా.. వారిలో పెద్దపాప వీక్షిత(9 నెలలు) గురువారం ఆడుకుంటూ నేలపై ఉన్న జామకాయ ముక్కను నోట్లో పెట్టుకుని మింగే ప్రయత్నం చేసింది. అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడకపోవడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చిన్నారి గొంతులోని జామ ముక్కను కక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇదీ చదవండీ.. Minor Girl Rape Case : వెంటబడిన మానవమృగం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం