ETV Bharat / crime

బాలిక అనుమానాస్పద మృతి.. తక్షణ సాయం అందించిన కలెక్టర్ - hyderabad crime news

బాలిక అనుమానాస్పద మృతి.. తక్షణ సాయం అందించిన కలెక్టర్

author img

By

Published : Sep 10, 2021, 6:28 AM IST

Updated : Sep 10, 2021, 12:05 PM IST

06:26 September 10

బాలిక అనుమానాస్పద మృతి.. తక్షణ సాయం అందించిన కలెక్టర్

బాలిక అనుమానాస్పద మృతి.. తక్షణ సాయం అందించిన కలెక్టర్

హైదరాబాద్‌ సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. ఇదే కాలనీలో నిన్న అదృశ్యమైన చిన్నారి.. పక్కనే నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి విగతజీవిగా కనిపించింది. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బాలికపై రాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. రాజును తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చంపాపేట్​ రహదారిపై కాలనీవాసులు ధర్నాకు దిగారు. బాలికను హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కాలనీవాసులకు నచ్చజెప్పే క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులపై రాళ్లు రువ్వారు. స్థానికుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కలెక్టర్​ పరామర్శ..

బాధిత కుటుంబాన్ని హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.50 వేల చెక్ అందించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని.. రెండు పడక గదుల ఇల్లు, పొరుగు సేవల ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కాలనీలో బెల్ట్ షాపులు, గుడుంబా లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

'ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడిని వదిలేదు లేదు. సాధ్యమైనంత తొందరగా నిందితుడికి శిక్ష పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.50 వేలు అందించాం. డబుల్​ బెడ్​ రూం ఇల్లు కేటాయించేలా చూస్తాం. పొరుగు సేవల ఉద్యోగం ఇప్పిస్తాం.' -శర్మన్​, హైదరాబాద్​ కలెక్టర్

ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని డీసీపీ రమేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మృతదేహాన్ని తరలించే సమయంలో పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. పాప మృతదేహానికి  ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం జరుగుతోందని... మరో రెండు గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఫాస్ట్​ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి తొందరగా శిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

'ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించాం. మా వాళ్లు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఇంకో 2 గంటల్లో పట్టుకునే అవకాశం ఉంది. ఫాస్ట్​ట్రాక్​ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడేలా చేస్తాం.' -రమేశ్​రెడ్డి, డీసీపీ  

ఇదీ చూడండి: ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి మృతి

Last Updated : Sep 10, 2021, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.