Woman's Naked Body Found at Kokapet : హైదరాబాద్ కోకాపేట సెవెన్‌హిల్స్ వద్ద దారుణం చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. ఖాళీ ప్రదేశంలో నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు.. నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారం, పది రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చని నార్సింగి సీఐ శివకుమార్ పేర్కొన్నారు.
రేప్ చేసి చంపేశారు..!
Woman's Naked Body at Kokapet : 'ఇవాళ పొద్దున్నే ఇక్కడి స్థానికులు మాకు ఫోన్ చేసి.. ఓ ఖాళీ ప్రదేశంలో నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం కనిపించిందని చెప్పారు. వెంటనే మేం మా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఇక్కడికి వచ్చాం. ఆమె డెడ్‌బాడీ చూసిన తర్వాత ఎవరో అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని అనుమానం కలుగుతోంది. దాదాపు ఓ పదిరోజుల క్రితం ఈ ఘటన జరిగొండచ్చు. ఇప్పటికైతే మేం కేసు నమోదు చేశాం. దర్యాప్తు ప్రారంభించాం. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయో చూసి ఫుజేటీ పరిశీలిస్తాం.. ఇంకా మహిళ మిస్సింగ్ కేసులేమైనా ఉన్నాయేమో చూసి ఆమె ఎవరో గుర్తిస్తాం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.'
- శివకుమార్, నార్సింగి సీఐ