RDO arrested for demanding 1lakh bribe: అవినీతి నిరోధక శాఖ(అనిశా) వలలో మరో పెద్దచేప పడింది. పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి, రామగుండం నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ శంకర్‌కుమార్ మంగళవారం రూ.లక్ష లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు.
పోలీసుల వివరాల ప్రకారం
గోదావరిఖనికి చెందిన గుత్తేదారు గైక్వాడ్ రజనీకాంత్, గతేడాది కరోనా సమయంలో రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసే పనిచేశారు. దానికి సంబంధించి రూ.9,28,796 బిల్లులు రావాల్సి ఉంది. ఆ సొమ్ము కోసం ఏడాదిగా నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్ కొద్దినెలల కిందటే బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో మూడు రోజుల కిందట రజనీకాంత్ ఆర్డీవోను కలిశారు. రూ.లక్ష ఇస్తేనే బిల్లు మంజూరుచేస్తానని ఆయన స్పష్టం చేయడంతో అనిశాను ఆశ్రయించారు. అనిశా అధికారుల సూచన మేరకు రజనీకాంత్ సొమ్ముతో మంగళవారం సాయంత్రం పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీవో సూచన మేరకు, ఆయన ఇంట్లో పనిచేసే ప్రైవేటు సహాయకుడు తోట మల్లికార్జున్‌కు రూ.లక్ష అందజేశారు. ఆ మొత్తాన్ని మల్లికార్జున్, కార్యాలయంలోనే ఉన్న శంకర్‌కుమార్‌కు అందజేయగా, అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశామని, బుధవారం కరీంనగర్ అనిశా కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య తెలిపారు. సెప్టెంబరు 4న పెద్దపల్లి జిల్లా ముఖ్యప్రణాళికాధికారి(సీపీవో) వెంకటనారాయణ కూడా రామగుండం నగరపాలక సంస్థ గుత్తేదారు నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కడం గమనార్హం.
ఇటీవల అనిశాకు చిక్కిన అధికారులు
- రూ.20 వేలు లంచం తీసుకుంటూ
యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ వెంచర్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ దేవానంద్.. డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడి సమయంలో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు బయటకు వెళ్లకుండా తలుపులు వేసి సోదాలు కొనసాగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రూ.30వేలకు కక్కుర్తి పడి..
రూ.2 లక్షల జీతం వస్తున్నా రూ.30వేలకు కక్కుర్తి పడి ఓ విద్యుత్ అధికారి అనిశా(Anti Corruption Bureau) వలలో చిక్కాడు. అతణ్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అనిశా ప్రత్యేక కోర్టు(ACB special court)లో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి