ETV Bharat / crime

Khiladi Lady Cheating: ఫేస్​బుక్ ప్రొఫైల్స్​తో కి'లేడి' వలపు వల.. చిక్కారో విలవిల - honey trap with fake fb profiles

Khiladi Lady Cheating: ఇంటర్ చదివింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లిచేశారు. కొన్నేళ్లకే విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కూడా ఫెయిల్​ అయింది. మళ్లీ విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ.. మిషన్ భగీరథలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. వచ్చే జీతం సరిపోక.. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంది. దానికి ఫేస్​బుక్​ బెటర్​ ఆప్షన్ అనుకుంది. ఇంకేంటి అందులో యువతీయువకుల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచి.. అమాయకులకు వలపు వల వేసింది. ఆమె తీయని మాటల మాయలో పడిన వారి నుంచి నెమ్మదిగా డబ్బు గుంజడం మొదలుపెట్టింది. మోసపోయామని గ్రహించిన వారు పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ బయటపడింది.

Khiladi Lady Cheating, Khiladi Lady, కిలాడీ లేడీ
కిలాడీ లేడి వలపు వల
author img

By

Published : Dec 7, 2021, 9:58 AM IST

Khiladi Lady Cheating : జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ మహిళ(35) రెండుసార్లు వివాహం చేసుకుని ఇద్దరితోనూ విడిపోయి కరీంనగర్​లో ఒంటరిగా నివసిస్తోంది. ప్రస్తుతం మిషన్ భగీరథలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. నగరంలోని తిరుమలనగర్​లో నివాసముంటున్న ఈ మహిళ.. కష్టపడకుండా బాగా డబ్బు సంపాదిచాలనుకుని పక్కదారులు పట్టి చివరకు పోలీసులకు చిక్కింది.

మాటలతో మాయ..

Cheating with FB profiles : ఫేస్​బుక్​లో యువతీయువకుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి వారికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి నెమ్మదిగా వారితో మాట కలుపుతుంది. కాస్త స్నేహం కాగానే తీయని మాటలతో మాయ చేస్తుంది. ఆమె వలపు వలలో పడిన బాధితులు ఆమె చెప్పేవన్ని నిజాలనుకుని నమ్మేస్తారు. అలా వారిని మచ్చిక చేసుకున్న తర్వాత.. తన కుటుంబం కష్టాల్లో ఉందంటూ వారి నుంచి నెమ్మదిగా డబ్బు దండుకుంటుంది. ఇలా ఆమె చేతిలో యువకులే కాదు యువతులు కూడా మోసపోయారు.

గొంతు మార్చి మాట్లాడి..

Khiladi Lady honey trap : గొంతు మార్చే యాప్​లతో యువతులకు ఫోన్ చేసి అబ్బాయిలా మాట్లాడుతూ వారికి వలపు వల వేస్తుంది. వాళ్లు నమ్మారని అర్థమయ్యాక తన కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగాలేదనో లేక ఆర్థికంగా నష్టాల్లో ఉన్నామనో నమ్మబలికి ఆ అమ్మాయిల నుంచి నగదు కాజేస్తుంది. ఆ తర్వాత వారితో కాంటాక్ట్ కట్ చేస్తుంది. చివరకు మోసపోయామని గ్రహించిన అమాయకు ఆడపిల్లలు కరీంనగర్ పోలీసులను ఆశ్రయించగా అసలు కథంతా బయటపడింది. ఇలా ఆమె చేతిలో ఇప్పటి వరకు చాలా మంది మోసపోయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 34 నకిలీ ఫేస్​బుక్ ఖాతాలు సృష్టించి అమాయకులకు ఎర వేసిందని తెలిపారు.

అబ్బాయిలకు వలపు వల..

Honey Trap with FB Profiles : మరోవైపు అబ్బాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించి వారు యాక్సెప్ట్ చేయగానే నెమ్మదిగా మాటల్లో దింపేది. తీయని మాటలతో మెల్లగా మాయ చేసి అశ్లీల‌మైన ప‌దాలు వాడుతూ వారిని ముగ్గులోకి లాగుతుంది. ఆ చాట్​ను స్క్రీన్ షాట్ తీసి వారికే పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తుంది. తాను అడిగిన డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించడంతో తమ పరువు పోతుందని ఆ యువకులు ఆమెకు నగదు ఇచ్చేవారు. చివరకు వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఆ కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు.

రూ.20 లక్షల దోచేసింది..

Fake Fb Profile Cheating : ఇప్పటివరకు బాధితుల నుంచి ఆ మహిళ రూ.20 లక్షలు దోచుకున్నట్లు కరీంనగర్ సిటీ టాస్క్​ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఆ మాయలేడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆమె నుంచి రూ.2 లక్షల నగదు, ఒక ల్యాప్​టాప్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమె చేతిలో మోసపోయిన వారిలో యువతీయువకులే గాక.. ఉద్యోగులు, మీడియా వారున్నట్లు గుర్తించారు.

అమ్మాయిలు అప్రమత్తం..

Lady Honey Trap News : తెలియని వ్యక్తుల నుంచి ఫేస్​బుక్​లో రిక్వెస్ట్ వస్తే అంగీకరించొద్దని కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్ సూచించారు. ఎవరైనా తీయని మాటలు చెబుతూ.. అకస్మాత్తుగా ఇంట్లో వాళ్ల ఆరోగ్యం బాగాలేదనో.. ఆర్థికంగా నష్టాల్లో ఉన్నామనో డబ్బు అడిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్పారు. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.