ETV Bharat / crime

పసితనంలో అంగవికలురాలిని చేశాడు.. ఆరేళ్లకు వాగులో పడేసి హతమార్చాడు - Mahabubnagar Father Killed Daughter

father killed his daughter
father killed his daughter
author img

By

Published : Jan 5, 2022, 9:23 AM IST

Updated : Jan 6, 2022, 10:01 AM IST

09:21 January 05

father kills disabled daughter in Mahabubnagar: బాలానగర్‌ మండలం సూరారంలో దారుణం

Father Killed Daughter in Mahabubnagar: తన కారణంగానే కాళ్లు చచ్చుపడిపోయిన కన్నబిడ్డపై ఏమాత్రం కనికరం చూపకుండా వాగులో పడేసి ప్రాణం తీశాడు ఓ తండ్రి. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం సూరారంలో బుధవారం ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది.

జడ్చర్ల గ్రామీణ సీఐ జములప్ప, గ్రామస్థుల కథనం ప్రకారం.. ఇదే జిల్లా హన్వాడ మండల కేంద్రానికి చెందిన రావుల రాజు, నవాబ్‌పేట మండలం దేపల్లికి చెందిన మంజులకు 13 ఏళ్ల కిందట వివాహమైంది. అప్పటి నుంచి వీరు బాలానగర్‌ మండలం సూరారంలోనే ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మూడో అమ్మాయి స్నేహ(6) పసితనంలో ఉండగా మంజులతో గొడవపడిన రాజు.. ఆ కోపంలో పాపను విసిరేశాడు. దీంతో ఆమె వెన్నుపూస విరిగి రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. నడవలేని ఆ చిన్నారి మంచానికే పరిమితమైంది. గత నెల 6న తల్లి మంజుల అనారోగ్యంతో చనిపోయింది. ఈ క్రమంలో స్నేహను పెంచడం భారంగా భావించాడో ఏమో.. ఈ నెల 4న తెల్లవారుజామున నిద్రిస్తున్న బాలికను తండ్రి రాజు సూరారం సమీపంలోని దుందుభి వాగులో పడేశాడు. బుధవారం ఉదయం వాగులో చిన్నారి మృతదేహం తేలడంతో గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: Tragedy: బాలుడి అదృశ్య ఘటన విషాదాంతం.. చెరువులో మృతదేహం!

Last Updated : Jan 6, 2022, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.