Hanamkonda Road accident: ఈ తెల్లవారుజామున హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. హనుమాన్ జంక్షన్ వద్ద ఆగి ఉన్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
దామెర మీదుగా వరంగల్‌కు వస్తున్న కారు... హనుమాన్ జంక్షన్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. గాయపడ్డ వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... క్రేన్ సహాయంతో కారును తొలగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఇదీ చదవండి: Minister Vehicle Accident: బైక్‌ను ఢీకొట్టిన మంత్రి వాహనం.. ఒకరు మృతి