రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన కుటుంబసభ్యులతో షిరిడీ వెళ్లి తిరిగి వస్తుండగా.. కర్ణాటకలోని బసవ కల్యాణ వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపిన కారును వేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఘటనలో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా.. కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన మృతి పట్ల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు.
ఇవీ చదవండి: