రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు వెంకటాపురం గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేశారు.
రహస్యంగా పేకాట ఆడుతున్న 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 15,750 రూపాయలు, 5 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో అప్పగించామని టాస్క్ ఫోర్స్ ఎస్సై రామ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: 'సలార్'లో ప్రభాస్ అక్కగా తమిళ స్టార్ నటి!