Robbery gang arrested: హైదరాబాద్ జంట నగరాల్లో కార్లు అద్దెకు తీసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి వేళల్లో టాక్సీల పేరుతో కార్లు నడిపి ఒంటరి ప్రయాణికులను ఎక్కించుకొని వారి దగ్గర నుంచి విలువైన వస్తువులు లాక్కొంటున్న ఈ ముఠాను గోపాలపురం పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందం కలిసి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన ఖలీల్, మహబూబ్ బాషా, అబ్దుల్ హసన్, మహమ్మద్ ఖాన్లు అద్దెకు కార్లను తీసుకొని రాత్రి వేళల్లో తిప్పుతుంటారు.
ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని వారిని కారులో ఎక్కించుకుంటారు. ఆ తర్వాత వారిని కత్తులతో బెదిరించి వారి దగ్గర నుంచి విలువైన ఆభరణాలు, సెల్ ఫోనులు తీసుకొని వారిని ఎవరు లేని ప్రదేశంలో విడిచిపెట్టి వెళ్లిపోతారు. చిలకలగూడ నుంచి సంగీత్ వైపుకు వెళ్తున్న ఈ ముఠాను గోపాలపురం పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందం కలిసి సంయుక్తంగా చేధించి పట్టుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తీ పేర్కొన్నారు.
నిందితుల దగ్గర నుంచి 2 కార్లు 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వివరించారు. నిందితులపై గతంలో పలు నేరాలకు సంబంధించి కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు కార్లు అద్దెకు తీసుకున్నప్పుడు గాని ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రర్తలు తీసుకొవాలని డీసీపీ సూచించారు.
"హైదరాబాద్కు చెందిన ఖలీల్, మహబూబ్ బాషా మరికొందరు కార్లు అద్దెకు తీసుకుంటారు. రాత్రి వేళలో వారు కార్లు నడిపి ఒంటరి వ్యక్తులను ఎక్కించుకుంటారు. ప్రయాణికులను బెదిరించి వారి దగ్గర నుంచి సెల్ఫోన్లు, విలువైన వస్తువులు తీసుకొని ఎవరు లేని ప్రదేశంలో వారిని విడిచిపెట్టి వెళ్లిపోతారు. నిందితులు దగ్గర రెండు కార్లు, 13 ఫోన్లు తీసుకొని సీజ్ చేశాం."- చందన దీప్తీ, డీసీపీ
ఇవీ చదవండి: