ఏపీలోని అనంతపురం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయ భవనం పైనుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు విజయ్ కుమార్‌గా గుర్తించారు.
అనంతపురం జిల్లా మడకశిర మండలం హెచ్.ఆర్.పాలెంలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. హెచ్.ఆర్.పాలెంలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తితో పాటు మరో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: Corona: నెల రోజుల్లో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు!