Sugarcane farmers protest: జగిత్యాలలో చెరుకు రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గతవారం మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా.. చెరుకు రైతుల అరెస్ట్‌లపై వరుసగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలలోని చౌరస్తా వద్ద చెరకు రైతులు మరోసారి నిరసనకు దిగారు. ధర్నాకు అనుమతి లేకపోవటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
ఈ క్రమంలోనే రైతు సంఘం నేత పన్నాల తిరుపతి రెడ్డి.. డీఎస్పీ ప్రకాశ్‌ను నెట్టి వేశారు. దురుసుగా ప్రవర్తించారనే కారణంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి..
ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరవాలంటున్న రైతులు.. ఏడేళ్లయినా గోడు వినరా?
తనయుడితో కలిసి పదో తరగతి పరీక్ష.. తండ్రి పాస్.. కొడుకు ఫెయిల్