సకాలంలో బిల్లులు రాక.. అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో ఉప సర్పంచ్ ఆత్యహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాటారం మండలం చిదినేపల్లి పంచాయతీ ఉప సర్పంచ్ బాల్నే తిరుపతి అప్పు తీసుకొని పంచాయతీ పనులు చేయించాడు. అయితే సకాలంలో బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో పురుగుల మందు తాగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
బాధితుడిని హుటాహుటిన భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే తిరుపతి మృతి చెందాడు. అయితే 8 నెలల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఉప సర్పంచ్ భార్య మృతి చెందగా.. ఇప్పుడు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల మరణంతో పిల్లలిరువురు అనాథలుగా మిగిలారు. వారిని ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: