ETV Bharat / crime

తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదేనా.!

Gurukul Student Suicide: గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరతగతి చదువుతున్న ఓ బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ విద్యార్థి ఇవాళ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Student Suicide Attempt
Student Suicide Attempt
author img

By

Published : Jun 24, 2022, 8:33 PM IST

Gurukul Student Suicide: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిపెడ మండలం తానంచర్ల శివారు డక్నాతండాకు చెందిన బాలుడు గిరిజన గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బడిలో ఉండటం ఇష్టం లేకనే నిన్న సాయంత్రం పురుగులమందు తాగి బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది.

బాలుడు పురుగుల మందు తాగిన అనంతరం భయంతో ఉపాధ్యాయులకు చెప్పడంతో.. హుటాహుటిన బాలుడ్ని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురువారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్న చంటి ఇవాళ సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురుకుల పాఠశాలకు మందు 'డబ్బా ఎలా వచ్చింది.. అబ్బాయినే భయపడి పురుగుల మందు డబ్బాను తన వెంట తీసుకొచ్చుకున్నాడా' అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లయితే నిజాలు బయటకొచ్చే అవకాశం ఉందని తండావాసులు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.