కారును లారీ ఢీ కొన్న ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ప్రమాదం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పరకాల క్రాస్‌రోడ్ వద్ద జరిగింది.
హుజూరాబాద్‌కు చెందిన రాజూరి మణిదీప్(22) తన పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో కలిసి జరుపుకున్నాడు. అనంతరం హుజురాబాద్ నుంచి ఎల్కతుర్తి వెళ్తున్న క్రమంలో పరకాల క్రాస్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందగా అతని స్నేహితులు నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పథకం ప్రకారం హత్య.. భూవివాదాలే కారణం